మూడు సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయిన అక్కినేని అఖిల్… తన కెరీర్‌పై సీరీయస్‌గా దృష్టిపెట్టినట్లు కనపడుతోంది. ప్రస్తుతం బొమ్మరిల్లు బాస్కర్‌తో సినిమా చేస్తున్న అఖిల్… తన తర్వాత సినిమాలను కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్లు కనపడుతోంది. టాలీవుడ్‌లో సేఫ్ గేమ్ ఆడుతున్న హీరోలనే ఫాలో అవుతూ మినిమం గ్యారెంటీ హిట్‌గా ఉండే రీమేక్‌పై దృష్టిపెట్టినట్లు కనపడుతోంది.
హిందిలో బ్లాక్‌బాస్టర్ హిట్ అయిన కామెడీ ఎంటర్‌టైనర్ బదాయి హో సినిమాను రీమేక్ చేసే పనిలో అఖిల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ తీసుకున్న సూర్య దేవర నాగవంశీ అఖిల్‌తో రీమేక్ కోసం చర్చలు జరిపాడని ఇండస్ట్రీ టాక్. అయితే… ఇది ఇంకా చర్చల దశలోనే ఉండగా, తమిళ్ డైరెక్టర్ మిత్రన్‌తో కలిసి తమిళ్, తెలుగులో ఓ సినిమా చేయాలని అఖిల్ భావిస్తున్నాడట.
దీంతో సేఫ్ ప్రాజెక్ట్‌లతో ముందు బండిని గాడిలో పెట్టే పనిలో అఖిల్ బిజీగా ఉన్నాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.