అక్కినేని అఖిల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. ఓరకంగా ఈ మూవీతో అయినా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాల్సిన అనివార్యమైన పరిస్థితుల్లో ఉన్నారు. బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో అఖిల్-పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా ఈ మూవీ తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించింది చిత్ర యూనిట్.
జూన్ 19న వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ తో పాటు పూజా-అఖిల్ మధ్య ఓ రొమాంటిక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తికాగా, త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలవ్వనున్నాయి. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు.