వరుస ఫ్లాప్ లతో సతమతమవుతున్న అక్కినేని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. అయితే సమ్మర్ లోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతికి సిద్ధం అవుతుంది. అయితే తాజా సినీ వర్గాల సమాచారం మేరకు ఓ ప్రముఖ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కులను దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలకు సొంతం చేసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.