అఖిల్ , హలో, మిస్టర్ మజ్ను సినిమా ల ఫ్లాప్ తో సతమతపడ్డ అఖిల్ … సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు అఖిల్. పూజా హెగ్డే కథానాయికగా చేస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని భావించినప్పటికీ కరోనా వైరస్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కరోనా ఉదృతి కాస్త తగ్గగానే సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూట్ ప్లాన్ చేయాలని చూస్తున్నారట.
అంతే కాదు ముందుగా సాంగ్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డేల మధ్య లవ్ సీన్స్ చాల కొత్తగా ఉంటాయట. ముఖ్యంగా అఖిల్ పూజాల మధ్య కెమిస్ట్రీ చాల బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది.