కిరణ్ అబ్బవరం తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణుకథ. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో కష్మీర హీరోయిన్ గా నటించింది. ఈనెల 18న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం భారీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 16వ తేదీన ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేశారు.
సాధారణంగా గీతాఆర్ట్స్-2 లో జరిగే ఫంక్షన్లకు మెగా హీరోలు ముఖ్య అతిథులుగా హాజరవుతుంటారు. ఇప్పటికే పలుమార్లు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. రీసెంట్ గా ఓ ఫంక్షన్ కు సాయితేజ్ కూడా హాజరయ్యాడు. వినరో భాగ్యము విష్ణుకథ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం అక్కినేని అఖిల్ ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తున్నారు.
గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై గతంలో ఓ సినిమా చేశాడు అఖిల్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ తో వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.
అప్పట్నుంచి గీతా ఆర్ట్స్ తో అఖిల్ కు అనుబంధం ఏర్పడింది. ఆ చనువుతో కిరణ్ అబ్బవరం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అఖిల్ ను ఆహ్వానించారు. వెంటనే అతను కూడా ఓకే చెప్పేశాడు.