అక్కినేని నాగర్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు సినిమాలు చేశాడు అక్కినేని అఖిల్. అయితే ఈ మూడు సినిమాలు కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తన 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు అఖిల్. అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా హెగ్డే లుక్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే పూజ హెగ్డే తో పాటు మరో హీరోయిన్ కూడా ఈ సినిమాలో ఉందట. ఆ పాత్రలో నేహా శెట్టి నటిస్తున్నట్లు తాజా సమాచారం. గతంలో నేహా ఆకాష్ పూరి మెహబూబా సినిమాలో కథానాయికగా నటించింది. ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.