సమాజ్ వాది పార్టీపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సమాజ్ వాది పార్టీకే సోషలిస్టు పార్టీ అని దాని ఫార్ములా వేరే ఉందని మండిపడ్డారు. యూపీలోని ఫిరోజాబాద్ లో బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు.
తమకు మరో ఐదేండ్లు అధికారం ఇస్తే రైతులు కరెంట్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో రాబోయే ఐదేండ్లకు రైతులకు ఎలాంటి విద్యుత్ బిల్లులూ ఉండవన్నారు.
‘ సమాజ్ వాది పార్టీ పేరుకే సోషలిస్టు పార్టీ. సమాజ్ వాదిలో ఎస్ అంటే సంపత్తి(సంపద)ని ఇతరుల నుంచి సేకరించడం, పీ అంటే పవర్ ను కుటుంబ సభ్యులకు అప్పగించడం. వేరే ఎవరికి ఆ పార్టీలో స్థానం లేదు ” అని అన్నారు.
‘ పన్నులను వసూలు చేయడం, ఆ డబ్బుతో విదేశాలకు వెళ్లడం అఖిలేశ్ యాదవ్ మోటో. కానీ పన్నులు వసూలు చేయడం, వాటిని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలకు వాడటమే బీజేపీ నమ్మిన సిద్దాంతం” అని అన్నారు.