సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మూడు సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్. మొదట వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా తరువాత హలో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ తరువాత మిస్టర్ మజ్ను అంటూ వచ్చాడు. అదికూడా అందరినీ నిరాశపరిచింది. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కంటే 20 శాతం ఎక్కువ అయిందట.
మరోవైపు ఈ సినిమాపైనే అఖిల్ ఆశలు అన్ని పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు 45 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందట. ఇక అఖిల్ మార్కెట్ 25 కోట్లకు మించి లేదు. కానీ నిర్మాత అనిల్ సుంకర మాత్రం వెనకడుగు వేయడం లేదట. ఆ సినిమాపై మంచి నమ్మకం తో ఉన్నాడట. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తో హిట్ కొడితే గాని అఖిల్ తన మార్కెట్ ను పెంచుకోలేడు. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.