డీవీవీ దానయ్య నిర్మాణంలో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా కొత్త సినిమా ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాను ప్రకటిస్తూ డీవీవీ ఎంటర్టైనర్ ఒక పోస్టర్ విడుదల చేయగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ పోస్టర్ లో పవన్ వెనకవైపు నిలబడి ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
పవన్ ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారని క్యాప్షన్ ఇచ్చింది.ఇక పవన్ కళ్యాణ్ సుజిత్ కొత్త సినిమా గురించి పవన్ కళ్యాణ్ వీరాభిమాని టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా అడవి శేష్ ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ హీరోలు సుజిత్ ను కలిసి సినిమా చేయాలని అడిగారు.అయినప్పటికీ ఆ డైరెక్టర్ మాత్రం టాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారని ఈయన వెల్లడించారు.
ఈ విధంగా మూడు సంవత్సరాలు తర్వాత సుజిత్ అందరికీ ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసే అవకాశం వచ్చిందని తెలిపారు.ఇక ఈ ప్రాజెక్టు విషయంలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా చాలా ఆసక్తిగా ఉన్నారని, తాను పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాకుండా సుజీత్ కి కూడా పెద్ద అభిమానిని తెలిపారు.
మరి ఈ స్టార్ హీరోని ఎలా ప్రజెంట్ చేయాలో సుజిత్ కి బాగా తెలుసు అంటూ అడవి శేష్ పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టు గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక సినిమాల పరంగానే కాకుండా అడివి శేష్ వ్యక్తిగతంగా కూడా పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే అకిరా, ఆధ్యాతో ఈయనకి ఎంతో మంచి బాండింగ్ ఉందనే సంగతి మనకు తెలిసిందే.