నాగార్జున భార్యగా, ఇద్దరు హీరోల తల్లిగా మాత్రమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అమలా, అయిదేళ్ల తర్వాత తెరపై మళ్లీ తెరపై కనిపించడానికి రెడీ అవుతోంది. 2012లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో అమలా అమ్మ పాత్రలో కనిపించి మెప్పించింది. అమలా నటించడం ఆ పాత్రకే హుందాతనం తెచ్చింది అనే కాంప్లిమెంట్స్ అందుకుంది, ఏడేళ్లు గడుస్తున్నా మళ్లీ తెరపై కనిపించని అమలా, ఇప్పుడు శర్వానంద్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వాళ్ల నాన్న, ఈ సినిమాలో రవి రాఘవేంద్ర శర్వా తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా… శ్రీ కార్తీక్ దర్శకత్వంలో, ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా రెండో షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఇందులో శర్వానంద్, అమల, రవి రాఘవేంద్రల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
కథ, పాత్ర నచ్చితేనే తెరపై కనిపించడానికి ఒప్పుకుంటున్న అమలా, ఓకే చెప్పడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. స్నేహం, ప్రేమ మధ్య విడదీయరాని బంధాన్ని తెలియజేసేలా ఈ చిత్రం ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది. తెలుగు తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రలలో నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు తారాగణం. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం: జాక్స్ జిజోయ్, ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్.