అప్పట్లో భానుమతి పేరు కాస్త సంచలనం అనే చెప్పాలి. మహానటి సావిత్రి కంటే ముందే ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. అగ్ర హీరోయిన్ గా స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసారు. అయితే ఆమె రోమాన్స్, లవ్ ట్రాక్ ఉన్న కథల విషయంలో వెనకడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకనే ఆమె కాస్త వెనకబడ్డారు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎన్నో మంచి సినిమాలు చేసారు భానుమతి.
నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రమే ఆమె సినిమాలు చేసేవారు అని అంటారు. అగ్ర హీరోల సినిమాలు అయినా కథ నచ్చలేదు అంటే రిజెక్ట్ చేసేవారు. ఇదే సమయంలో అక్కినేనికి ఆమెకు మధ్య వివాదం నడిచింది అంటారు. ఆయనపై ఆధిపత్యం కోసం ఆమె ఎన్టీఆర్ తో ఎక్కువ స్నేహంగా ఉండేవారు అనే ప్రచారం కూడా జరిగింది. విప్రనారాయణ సినిమాలో భానుమతి ఒక లవ్ సీన్ చేసే దగ్గర దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
అక్కినేనికి కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆ సమయంలో అక్కినేని చేయి భానుమతికి తగలడంతో పెద్ద గొడవ అయింది అనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ కొనసాగింది. సీతారామయ్య గారి మనమరాలు సినిమాలో ఆమె నటించాల్సి ఉంది. అక్కినేని కూడా ముందు ఓకే అనుకున్నారు. కాని అనూహ్యంగా కన్నడ నటి రోహిణి హట్టంగిడిని తీసుకొచ్చి సినిమా చేసారు. ఈ విషయం తెలిసిన భానుమతి ఆ సినిమాలో పెద్దగా స్టోరీ లేదన్నారట.