‘వీర సింహారెడ్డి’ మూవీ సక్సెస్ ఈవెంట్ లో హీరో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ రియాక్ట్ అయ్యారు. ‘ఎన్టీఆర్, ఏఎన్నార్, రంగారావు లాంటి వారిని అవమానించడం అంటే మనల్ని మనం కించపరుచుకోవటమే’ అంటూ ట్వీట్టర్ ద్వారా ఓ ప్రకటన చేశారు.
సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే నాగ చైతన్య, అఖిల్.. బాలయ్య కామెంట్స్ పై రియాక్ట్ అవడం చర్చనీయాంశంగా మారింది. వీరసింహారెడ్డి విజయోత్సవ సక్సెస్ మీట్ లో ఫుల్ జోష్ లో మాట్లాడిన బాలయ్య.. సడెన్ గా సినిమాలో ఆర్టిస్టుల గురించి ప్రస్తావించారు.
తమ మధ్య రకరకాల విషయాలు చర్చకు వచ్చేవన్నారు. నాన్న గారు, ఆ డైలాగులు, రంగారావు గారు, ఈ అక్కినేని.. తొక్కినేని అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. పాత సినిమాలకు సంబంధించిన చాలా విషయాలు చర్చించుకున్నామని బాలయ్య మాట్లాడారు.
బాలకృష్ణ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది కాస్తా వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం బాలయ్య కామెంట్స్ పై అక్కినేని బ్రదర్స్ రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ వివాదం ఎక్కడి వరకూ దారి తీస్తుందో చూడాలి.
— chaitanya akkineni (@chay_akkineni) January 24, 2023