శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నాగ చైతన్య, తన కొత్త సినిమా మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమా మొదలైంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ తో చైతూ రొమాన్స్ చేయనుండగా… రకుల్ ప్రీత్ సింగ్, ప్రియాంక అరుల్ మోహన్ లు నటించే అవకాశం ఉంది.
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తుండగా, 2021 జులైలో రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇటీవల వరుస సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టిన నేపథ్యంలో ఈ మూవీతో ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.