అక్కినేని నాగార్జున వారసుడుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయిన యంగ్ హీరో అక్కిని నాగచైతన్య. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చైతూ తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయాడు. తరువాత సమంత హీరోయిన్ గా వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో యూత్ ని ఎట్ట్రాక్ట్ చేశాడు. అక్కడ నుంచి ఈ అక్కినేని కుర్రాడు, మాస్, క్లాస్ అని తేడా లేకుండా వరుస సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు.
ఇటీవల హీరోయిన్ సమంతని పెళ్లిచేసుకున్న చైతూ అటు ప్రొఫిషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ ని కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రస్తుతం వెంకటేష్, చైతూ హీరోలుగా వస్తున్న వెంకీమామ సినిమాతో సంక్రాంతికి సందడి చేయనున్నాడు. మరో వైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న చైతూ ఈ రోజు ఈ అక్కినేని యంగ్ హీరో 33 వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా సమంత, అఖిల్, నాగార్జున తో టాలీవుడ్ లోని ప్రముఖులు విషెస్ చెప్తున్నారు.