అక్కినేని యువ హీరో నాగ చైతన్య రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తున్న చైతూ… త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఎలాంటి సినిమా చేయాలి అనే అంశంపై లాక్ డౌన్ కాలంలో అనేక కథలు విన్న చైతన్య, రెండు సినిమాలను ఓకే చేసినట్లు తెలుస్తోంది.
నిజానికి గీత గోవిందం డైరెక్టర్ పరశురాంతో చైతూ సినిమా చేయాల్సి ఉంది. కానీ పరశురామ్ కు మహేష్ బాబు నుండి కాల్ రావటంతో, చైతూ ఇప్పుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. దిల్ రాజు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది.
ఇక మరో దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో కూడా చైతూ సినిమా చేయనున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ఈ సినిమా నిర్మించినున్నారు. ఈ రెండు సినిమాలు ఏకకాలంలో పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నాడట చైతూ.