ఫెరారీ నుండి మెర్సిడెస్ వరకు అన్నీ ఆ ఇంటి గ్యారేజీలో ఉండాల్సిందే..! అంత పిచ్చి ..కార్లంటే.! అతను మరెవరో కాదు. అక్కినేని నాగచైతన్య..! కెరీర్ పరంగా చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ కార్ల విషయంలో ఇంకా పర్టిక్లర్ ..!
యువసామ్రాట్ కు కార్లు, స్పోర్ట్స్ బైకులంటే విపరీతమైన ఇష్టం. మార్కెట్లోకి కొత్తగా ఏ స్పోర్ట్స్ బైకు వచ్చినా అతని మనసు దోచిందంటే చాలు ఆ వెంటనే దాన్ని తన గెరేజ్ లో ప్రత్యక్షమవ్వాల్సిందే.
ఈ నేపద్యంలో అక్కినేని నాగ చైతన్య దగ్గర లగ్జరీ బైకులు, కార్ల కలెక్షన్ భారీగానే ఉంది. మరి ఇంకేంటి ఆలస్యం చైతూ దగ్గరున్న ఆ ఖరీదైన వాహనాలేంటో? వాటి ఖరీదెంతో చూసేద్దాం..
చైతూ దగ్గరున్న అత్యంత ఖరీదైన బైకుల్లో BMWR9T ఒకటి. 2014లో లాంచ్ అయిన ఈ బైక్‌ను చైతన్య సుమారు రూ.19 లక్షలు ఖర్చు చేసి మరీ తన సొంతం చేసుకున్నాడు. దీనిపై సమంతతో మరీ రోడ్ల మీద పలు మార్లు చక్కర్లు కొడుతూ మీడియా కంటపడ్డాడు కూడా.
చైతన్య రేస్ బైక్‌లను ఎంతగా ఇష్టపడతాడో అతని ఖరీదైన బైకుల చుస్తే ఇట్టే అర్ధమయిపోతుంది. సుమారు 13 లక్షల విలువైన ఈ రేసర్ బైక్ Triumph Thruxton R Bike అతని సొంతం.
అసలు మార్కెట్ లో ఈ కారుకు క్రేజే వేరు. జాన్‌సేన నుంచి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ వరకు Ferrari F 430 రెడ్ బ్యూటీ కారుకు భారీ ఫాలోయింగే ఉంది.. ఈ కారు ధర రూ.1.75 కోట్లు.. చైతూ దగ్గర ఉన్న లగ్జరీ కార్ల కలెక్షన్ లో ఇది కూడా ఒకటి.
నాగ చైతన్య వద్ద ఉన్న Mercedes Benz G-Class G63 ఈ మెర్సిడిస్ బెంజ్ కారు ఖరీదు సుమారు కోటి రూపాయలు ఉంటుందట. చై తో పాటూ టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్‌లతో పాటు బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్, టీమ్ ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా వద్ద కూడా ఈ కారును సొంతం చేసుకున్నవాల్లలో ఉన్నారు.
నాగ చైతన్య వద్దనున్న లగ్జరీ బైకులలో ఆయన ఫేవరెట్ MV Agusta F4. ఈ బైకు ధర సుమారు రూ.26 నుంచి రూ.35 లక్షల మధ్య ఉంటుంది. ఈ బైకు పై చై షికార్లు చేస్తూ చాలా సార్లు మీడియా కంట పడ్డాడు.
అయితే వీటితో పాటు యమహా YZFR1 స్పోర్ట్స్ బైక్ మరియు హోండా స్పోర్ట్స్ బైక్ తో సహా మరిన్ని చై గ్యారేజీలో ఉన్నట్లు తెలుస్తోంది.