అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు విడిపోవడం ఏంటి అంటూ షాకయ్యారు. కాగా ఈ ఇద్దరు విడాకుల విషయం ఇప్పటివరకు నోరు విప్పని నాగార్జున తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విడాకులు తీసుకోవాలని ముందుగా సమంత నిర్ణయం తీసుకుందని ఆమె నిర్ణయాన్ని గౌరవించి చైతన్య కూడా నిర్ణయం తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. చైతన్య సమంత ఎంతో ప్రేమగా ఉండేవారని నాలుగేళ్ల వైవాహిక జీవితంలో వాళ్లిద్దరి మధ్య విడిపోయేటంతటి సమస్య నాకు తెలిసింతవరకూ రాలేదని అన్నారు. గతేడాది న్యూ ఇయర్ వేడుకలు కూడా వాళ్లిద్దరూ కలిసే ఎంతో సంతోషంగా చేసుకున్నారని తెలిపారు.
ఆ తర్వాతే వాళ్లిద్దరి మధ్య ఏదో సమస్య వచ్చిందని. కచ్చితంగా ఏమిటనేది తెలీదని…. కానీ, సమంతే మొదట విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుందని అందుకు అప్లయ్ చేసిందని అన్నారు.
నాగ చైతన్య ఎక్కువగా నా గురించి బాధపడ్డాడని విడాకులు విషయాన్ని నేను ఎలా తీసుకుంటాను, కుటుంబ పరువు, మర్యాద ఏమైపోతుందనే బాధ పడ్డాడు అని అన్నారు.