బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ప్రేక్షకుల ఆదరణతో మూడు సీజన్లను ముగించుకుని నాల్గవ సీజన్ కు రంగం సిద్ధం అయింది. అంతా భావించినట్టు గానే మూడవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జునే నాల్గవ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే తాజాగా బిగ్ బాస్ షూటింగ్‌లో నాగార్జున పాల్గొన్నారు. షూటింగ్‌కు హాజరయ్యా, లైట్, యాక్షన్, కెమెరా.. వావ్ అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. షూటింగ్ లొకేషన్‌లో తీసిన ఫొటోలను షేర్ చేశారు. మరోవైపు ఈ నెల రెండో వారం నుంచి బిగ్‌బాస్ 4 ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.
Back on the floor with Lights, Camera, Action..what a wow…WOW!!! pic.twitter.com/tHg30ZgLl6
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 1, 2020