అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ.ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఎట్టకేలకు సెప్టెంబర్ 24న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
అయితే ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 19న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని ప్రకటించారు చిత్రయూనిట్. అయితే తాజా సమాచారం ప్రకారం మరో గెస్ట్ కూడా రాబోతున్నారట. అది మరెవరో కాదు అక్కినేని నాగార్జున అని తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.