అందాల తార సమంత అక్కినేని వారి కోడలు అని అందరికీ తెలసిందే. చైతూ-సామ్ లవ్ మ్యారేజ్ తర్వాత కూడా సమంత సినిమాలతో బిజీ బిజీగా గడుపుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు ఏ చిన్న అవకాశం దొరికినా… ఫ్యామిలీతో గడుపుతూ, తానే స్వయంగా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
కానీ అక్కినేని వారి ఫ్యామిలీ అంతా ఓకే చోట చేరి ఫుల్ ఎంజాయ్ చేస్తే… సమంతా హాడావిడి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. సామ్-చైతూ మరింత రెచ్చిపోయి… గెట్ టుగెదర్‌ను మరింత హ్యాపీగా మార్చేస్తారు. కానీ ఈసారి మాత్రం ఎందుకో సమంత మిస్సయిపోయింది. అక్కినేని ఫ్యామిలీ అంత ఓ చోటకు చేరి ఫోటోకు ఫోజులిచ్చారు. కానీ ఆ ఫోటోలో సమంత లేని వెలితి స్పష్టంగా కనపడుతోంది. దీంతో సమంత మిస్సింగ్ అంటూ కొందరు, సమంత ఎటో వెళ్లిపోయింది అంటూ కొందరు… అయ్యో సామ్ లేకుండా ఇలా ఫోటో దిగుతారా అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడీ ఫోటో నెట్లో వైరల్ అవుతోంది. మరి ఇంతకు సమంత ఎక్కడకు వెళ్లిందో… ఎటు వెళ్లిందో… సమంత స్పందిస్తుందో లేదో చూడాలి.
మళ్లీ జియో వర్సెస్ ఎయిర్‌టెల్ !