టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ సమంత ప్రెగ్నెంట్ అని, త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి. కొంత కాలం క్రితం వరకు రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో తన ఫోటోలను పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉండే సామ్… ఈ మధ్య అసలు సోషల్‌మీడియాలోకి రావటమే మానేసింది. దీంతో ఆమె ప్రెగ్నెంట్ కాబట్టే ఫోటోలు పెట్టడం లేదు, అక్కినేని ఫ్యామిలీ త్వరలోనే గుడ్‌న్యూస్ చెప్పబోతుంది ఇలా రకరకాల వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ఫ్యాన్స్‌లోనూ హట్ టాపిక్ అయ్యాయి.
ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో రాబోయే ఓ వెబ్ సీరీస్‌లో నటిస్తోన్న సమంత… తొలిసారిగా ఈ విషయంపై స్పందించింది. నా గురించి తెగ ఆలోచిస్తూ, తెలుసుకోవాలి అనుకునే వారిని నేను చెప్పేదేంటీ అంటే… నా డెలివరీ డేట్ ఫిక్స్ అయింది. అది ఎప్పుడంటే.. ఆగస్ట్7, 7గంటలకి 2022లో అంటూ పోస్ట్ పెట్టింది. సమంత వ్యంగ్యంగా ఇచ్చిన సమాధానంతో ఇక ఈ ప్రచారానికి తెరపడ్డట్లే.