బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఏడాది మంచి లైనప్ ను సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యంగా బచ్చన్ పాండే సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ భయంకరంగా కనిపించారు.
ఇక పోస్టర్ పై “ముఝే భాయ్ నహీ, గాడ్‌ఫాదర్ బోల్తే హై” అనే పవర్‌ఫుల్ డైలాగ్ కూడా రివీల్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ నీలి కళ్ళతో తలకి ఓ కట్టు కట్టుకుని కనిపించాడు.
ఇక బచ్చన్ పాండే చిత్రం తమిళ చిత్రం జిగర్తాండకు రీమేక్ అని అంటున్నారు. జిగర్తాండ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించి హిట్ కొట్టారు.
ఇకపోతే బచ్చన్ పాండే ట్రైలర్ ఫిబ్రవరి 18, 2022న విడుదల కానుంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ ఏడాది మార్చి 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.