బాలీవుడ్ స్టార్స్ గురించి చెప్పేదేముంది. కోట్లలో ఆదాయం.. లగ్జరీ లైఫ్ కామన్. అత్యాధునిక హంగులతో ఉండే భవంతులు, అపార్ట్ మెంట్స్ లో జీవిస్తూ ఉంటారు. తాజాగా స్టార్ హీరో అక్షయ్ కుమార్ ముంబైలో ఓ కాస్ట్లీ అపార్ట్ మెంట్ కొన్నాడు.
ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ సొంతం చేసుకున్నాడు. 1878 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది ఉన్నట్లు సమాచారం. దీని కోసం అక్షయ్ ఏకంగా రూ.7.8 కోట్లు ఖర్చు పెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం అక్షయ్ తన ఫ్యామిలీతో జూహూలోని ఓ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉంటున్నాడు. కొత్తగా మరో అపార్ట్ మెంట్ ను కొనుగోలు చేశాడు. మొన్నటివరకు అంధేరిలోని ఓ ఖరీదైన కమర్షయల్ స్పేస్ ఉండేది. దానిని ఈ మధ్యే రూ.9 కోట్లకు అమ్మేశాడు.
అక్షయ్ కు ముంబైతో పాటు గోవా, మారిషస్ లో కూడా వ్యాపారాలు, కమర్షియల్ బిల్డింగ్స్ ఇతర ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇక ఒక్కో సినిమా రెమ్యూనరేషన్ వంద కోట్లకు పైనే ఉంటుందని టాక్.