కరోనా వైరస్ దెబ్బకు బాలీవుడ్ బెంబేలెత్తుతోంది. వరుసపెట్టి బీటౌన్ సెలబ్రెటీలు ఈ మహమ్మారి బారినపడుతున్నారు. రీసెంట్‌గానే అలియాభట్, రణ్‌బీర్‌కపూర్, మాధవన్, ఆమిర్‌ఖాన్, పరేష్ రావల్ వంటి నటులకు పాజిటివ్ నిర్ధారణ కాగా.. తాజాగా ఈ లిస్టులో బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్‌కుమార్ కూడా చేరిపోయారు. ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు.
నాకు కరోనా పాజిటివ్ తేలింది. కోవిడ్ 19 మార్గదర్శకాల మేరకు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్తున్నాను. డాక్టర్ల సూచనల మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నాను. ఇటీవల నన్ను కలిసినవారు జాగ్రత్తపడాలని.. అవసరమైతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను. కరోనా నుంచి కోలుకుని త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానంటూ ట్వీట్‌లో చెప్పాడు అక్షయ్ కుమార్.
బాలీవుడ్ ప్రముఖులు కరోనా బారినపడుతున్న తీరు చూస్తోంటే.. మహరాష్ట్రలో ఏం రేంజ్‌లో దాని ఉధృతి ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా అక్కడ రికార్డుస్థాయిలో కొత్త కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్కరోజే 50 వేల మంది అక్కడ కరోనా బారినపడ్డారు. 277 మంది మరణించారు. ప్రస్తుతం విజృంభిస్తున్న తీరు చూస్తోంటే.. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింత పెరిగేలా కనిపిస్తోంది.