బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ సినిమా శుక్రవారం విడుదలైంది. పలు దేశాల్లోని థియేటర్లలో మొదటి రోజు సినిమా విజయవంతంగా నడుస్తోంది. దీంతో అక్షయ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.
కువైట్, ఓమన్ దేశాల్లో మాత్రం ఈ సినిమా విడుదల కావడం లేదని తెలుస్తోంది. సినిమా విడుదలకు ఆయా దేశాల్లో అడ్డంకులు ఏర్పడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సినీ విశ్లేషకుడు గిరీశ్ జోహార్ ట్వీట్ చేశారు.
‘ కువైట్, ఓమన్ ప్రభుత్వాలు సామ్రాట్ పృథ్విరాజ్ సినిమాపై నిషేధం విధించాయి. అందువల్ల ఆయా దేశాల్లో ఈ సినిమాలు విడుదల కావడం లేదు’అని ట్వీట్ లో పేర్కొన్నారు. దానికి అక్షయ్ కుమార్, సోనూసూద్, సంజయ్ దత్, మానుషీ చిల్లర్ లను ట్యాగ్ చేశాడు.
ఈ సినిమాలో అక్షయ్ కుమార్, మానుషీ చిల్లర్ లు జంటగా నటించారు. ఈ సినిమాకు చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమాకు యూపీ సర్కార్ పన్ను మినహాయింపును ప్రకటించింది.