స్టార్ హీరో హీరోయిన్లతో తమ బ్రాండ్స్ ప్రమోట్ చేయించుకునేందుకు పెద్ద పెద్ద కంపెనీలు ఆసక్తి చూపుతుంటాయి. ఈ మేరకు స్టార్స్‌కి కోట్ల రూపాయలిచ్చి యాడ్ షూట్స్ చేయించుకుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పలు సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ ప్రొడక్ట్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అభిమానులకు క్షమాపణలు కూడా చెప్పారు.
అక్షయ్ కుమార్ ఇటీవల ఓ పాన్ మసాలా యాడ్ చేశారు. అయితే, దీనిపై అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శులు వచ్చాయి. ఓ సెలబ్రిటీ అయి ఉండి ఆరోగ్యంపై ప్రభావితం చేసే ఇలాంటి పొగాకు సంబంధిత యాడ్స్ చేయడం సరికాదంటూ అక్షయ్‌పై ట్రోల్స్ నడిచాయి. మరోవైపు ఇలాంటి యాడ్స్ చేయొద్దంటూ అభిమానుల నుంచి పలు రిక్వెస్టులు రావడంతో అక్షయ్ వెనక్కి తగ్గారు.
దీంతో ఆయన టొబాకో బ్రాండ్‌కు ఇకపై అంబాసిడర్‌గా కొనసాగనని తాజాగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. అలాగే, ఈ యాడ్ కోసం తాను తీసుకున్న రెమ్యూనరేషన్‌ను ఒక గొప్ప పని కోసం విరాళంగా ఇస్తానని ప్రామిస్ చేశారు.
‘నన్ను క్షమించండి. నేను మీకు, నా అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. గత కొన్ని రోజులుగా మీ స్పందన నన్ను తీవ్రంగా ప్రభావితం చేసింది. నేను పొగాకుకు సంబంధించిన యాడ్ లను ఇక ఎప్పటికీ ప్రచారం చేయను. విమల్ ఇలాచీతో నా యాడ్ విషయంలో మీ రియాక్షన్ చూసి, వెనక్కి తగ్గాను. నేను ఈ ఎండార్స్‌మెంట్ కోసం తీసుకున్న మొత్తం పారితోషికాన్ని ఒక గొప్ప కార్యానికి విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నేను చేసుకున్న ఈ యాడ్ అగ్రిమెంట్ లో చట్టపరమైన వ్యవధి ఉన్నంత వరకు బ్రాండ్ ప్రకటనలను ప్రసారం చేయడం కొనసాగించవచ్చు. అయితే భవిష్యత్ లో యాడ్స్ ను ఎంపిక చేసుకోవడంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. ప్రతిఫలంగా నేను మీ ప్రేమ, కోరికలను ఎప్పటికీ అడుగుతూనే ఉంటాను’ అని అక్షయ్ ట్వీట్ చేశారు.
— Akshay Kumar (@akshaykumar) April 20, 2022
Advertisements