‘ఆకుల’ అందుకే బయటికి వచ్చేశారా? - Tolivelugu

‘ఆకుల’ అందుకే బయటికి వచ్చేశారా?

నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి ఈజీగా జంప్ చేసేస్తున్నారు. జనం ఏమనుకుంటారో వారికి అనవసరం. తాజాగా ఆకుల సత్యనారాయణ జనసేనకు బైబై చెప్పారు. ఏపీలో అధికారంలో వున్న పార్టీ అయితే బెటర్ అని అనుకుంటున్నట్టు సమాచారం. జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ఆసలు ఆయన ఎందుకు వైసీపీలోకి వెళ్తున్నారు..? వైసీపీ ఆయనపై ఎందుకు ఫోకస్ పెట్టింది..?

, ‘ఆకుల’ అందుకే బయటికి వచ్చేశారా?

2014లో బీజేపీ టిక్కెట్టు-టీడీపీ మద్ధతు-ఎమ్మెల్యేగా గెలుపు..! 2019లో సరిగ్గా ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి జంప్-జనసేనలో జాయినింగ్..! లేటెస్టుగా అక్కడి నుంచి మళ్లీ జంప్..!

తన రాజకీయ జీవితంలో ఇన్ని మలుపులు తిరిగిన ఆ నేత ఆకుల సత్యనారాయణ. ప్రస్తుతం ఈయన జనసేన పార్టీకి గుడ్‌బై చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని శనివారం పవన్‌కల్యాణ్‌కు పంపనున్నట్లు ప్రకటించారు. తన రాజకీయ భవిష్యత్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటానని రాజమహేంద్రవరంలో మీడియాకు చెప్పారు. మరిప్పుడు ఆయన అడుగులు ఎటువైపు.. బీజేపీ వైపా.. లేక వైసీసీ వైపా..?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంచి వాయస్ వున్న నేతగా పేరున్న ఆకుల సత్యనారాయణ ఇప్పుడు వైసీపీలో చేరబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆకుల సత్యనారాయణ 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం బీజేపీ తరపున టీడీపీ మద్దతుతో విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికలకు కొన్ని నెలల ముందు బీజేపీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పవన్‌కల్యాణ్‌ సమక్షంలో జనసేనలో చేరారు. రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు.

ఆకుల తిరిగి తన మాతృ స్థానానికి, అంటే బీజేపీలోనే చేరతారనే ప్రచారం జరిగింది కానీ, వైసీపీలో చేరాలని ఆయన అభిమానులు పట్టుబడుతున్నారు. వైసీపీ రాజమహేంద్రవరం రూరల్‌ ఇన్‌చార్జిగా ఆకులకు అవకాశం ఇస్తారని అంటున్నారు. దీనిపై చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. విజయదశమి రోజున ఆకుల ఆ పార్టీలో చేరే అవకాశముంది.

ఎందుకు వెళ్తున్నారంటే…

అధికారంలో వున్న పార్టీలో చేరితే అనేక ప్రయోజనాలు వుంటాయనే ఉద్దేశంతోనే ఇటీవల అనేకమంది నేతలు వైసీపీ వైపు చేరుతున్నారు. వైసీపీ కూడా వీరందరిపై ఫోకస్ పెట్టడానికి ఒక రీజన్ వుంది.

ఎన్నికలకు ముందు ఆ పార్టీ బీసీలను అక్కున చేర్చుకుంది. ఇది ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన రాజకీయ వ్యూహం. అప్పట్లో తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకుగా వున్న బీసీలను తమ వైపు తిప్పుకోవాలని పీకే ఇచ్చిన ప్లాన్. అందులో భాగంగానే జగన్ తన పాదయాత్రలో వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి పార్టీలో చేర్చుకోవడమే కాకుండా అడిగిన వాళ్లకి అడిగినట్టుగా టిక్కెట్లు ఇంచుకుంటూ పోయారు.

పీకే ఇచ్చిన ఈ ప్లాన్ బాగా వర్కవుట్ అయ్యింది. టీడీపీకి సంప్రదాయ ఓటర్లుగా వున్న బీసీలు మొన్నటి ఎన్నికల్లో వైసీపీ వైపు వచ్చేశారు. దానికి చంద్రబాబు చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు కూడా కారణం. కాపులకు రిజర్వేషన్ల విషయంలో ఇటు కాపుల్ని ఆకట్టుకోలేకపోయి.. అటు బీసీలకు దూరమయ్యి టీడీపీ నేత పప్పులో కాలేశారని అంటారు. కాపులు దూరం కావడంలో చినబాబు పాత్ర బాగా వుందని ఆ పార్టీ శ్రేణులే చెబుతుంటారు. పవన్‌కల్యాణ్‌ని దూరం పెట్టాలనుకోవడం ఒక చారిత్రాత్మక తప్పిదమని టీడీపీ నేతలే అంగీకరిస్తారు.

టీడీపీ మొన్నటి ఎన్నికల్లో పవన్ పార్టీతో కలిసి పోటీ చేసి వుంటే ఆకుల సత్యనారాయణ వంటి నేతలు విజయం సాధించేవారు. అప్పుడు రాజకీయాలు పూర్తిగా డిఫరెంటుగా వుండేవి. టీడీపీ ఓటమికి గల వంద కారణాల్లో ఇది ఒక బలీయమైన కారణంగా విశ్లేషకులు కూడా తేల్చారు.

ఇదిలావుంటే, ఆ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి కాపు నేతలకు దూరమైన వైసీపీ ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలో మళ్లీ కాపు నేతలను తమ వైపు తిప్పుకోవడానికి వెంపర్లాడుతోంది. ముఖ్యంగా కాపు ఉద్యమం ఎప్పటికైనా తమకు అపకారం చేస్తుందని జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ముద్రగడ పద్మనాభం రాజకీయాల్లో సీతయ్య.. ఎవరి మాటా వినరు. అప్పట్లో ఆయన్ని తెలుగుదేశం పార్టీలోకి తెచ్చే ప్రయత్నం కొంతమంది చేసినా ఆయన అంగీకరించలేదు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడం కోసమే తన ప్రజా జీవితాన్ని ధారపోస్తున్నట్టు ఇప్పటికే ఆయన అనేకసార్లు ప్రకటించారు. ముద్రగడ పద్మనాభం రూపంలో పొంచి వున్న ముప్పును ఎదుర్కోవాలంటే ఆయన్ని ఒంటరి చేయడమే జగన్ ముందున్న  మార్గం. అందుకు వీలైనంత మంది కాపు రాజకీయ నేతల్ని తమ వైపు తిప్పుకుంటే మినహా అది సాధ్యం కాదు. అందుకే వైసీపీ ఇప్పుడు కాపు నేతలపై ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఇప్పటికే తోట త్రిమూర్తులు వైసీపీ గూటికి చేరారు. ఉభయగోదావరి జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులను, కాపు నాయకులను తమ వైపు తిప్పుకుంటే పద్మనాభం వల్ల జరిగే నష్టాన్ని నివారించడమే కాకుండా, పార్టీ కూడా మరింత బలపడుతుందనేది జగన్ యోచనగా ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ఇప్పుడు రాజమహేంద్రవరంలో బలమైన లీడర్‌గా వున్న ఆకుల సత్యనారాయణ వైపు కన్నేశారు. ఆకుల కూడా అధికార పార్టీలో చేరితే ఒనగూడే అనేకానేక ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని జగన్ శిబిరం ఇచ్చిన ఆఫర్‌కు ఓకే చేశారని సమాచారం.

, ‘ఆకుల’ అందుకే బయటికి వచ్చేశారా?

జనసేన పార్టీకి రాజీనామా చేసిన రాజమండ్రి సిటీ మాజీ ఎమ్మెల్యే డా.ఆకుల సత్యనారాయణ, ఆకుల సతీమణి లక్ష్మీ పద్మావతి

Share on facebook
Share on twitter
Share on whatsapp