మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అల వైకుంఠపురం. సంక్రాంతి బరిలో ఉన్న ఈ సినిమా… రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పాటలు విడుదల చేయగా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి.
అయితే, అల వైకుంఠపురం సినిమా హిట్ అవుతుందా అంటే త్రివిక్రమ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు ఇటు బన్నీ అభిమానులు కూడా కాస్త కంగారు పడుతున్నారు. దీనికో ప్రత్యేక కారణం లేకపోలేదు. త్రివిక్రమ్ రికార్డులే బన్నీ అభిమానులకు ఇప్పుడు కంగారు పుట్టిస్తున్నాయి.
త్రివిక్రమ్ పవర్ స్టార్ పవన్‌తో ముచ్చటగా మూడు సినిమాలు తీశాడు. ఫస్ట్ మూవీ జల్సా యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా… సెకండ్ మూవీ అత్తారింటికి దారేది సూపర్ హిట్ అయ్యింది. పవన్‌కు చాలా రోజుల తర్వాత మరో హిట్ ఇచ్చింది. వెంటనే వచ్చిన మూడో సినిమా అజ్ఞాతవాసి మాత్రం పవన్ అభిమానులను నిరాశపర్చింది. అంటే మూడు సినిమాల్లో మూడోది ఫ్లాప్ అయిందన్నమాట.
బన్నీతోనూ త్రివిక్రమ్‌కు ఇది మూడో సినిమా. ఫస్ట్ మూవీ జులాయి యావరేజ్ కాగా, సెకండ్ ఫిల్మ్ సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా అల వైకుంఠపురం. అందుకే ఇప్పుడు బన్నీ అభిమానులంతా టెన్షన్ పడుతున్నారు. అజ్ఞాతవాసి లాగే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుందేమోనని భయపడుతున్నారు. దీనికి తోడు తాజాగా విడుదలైన అల వైకుంఠపురం టీజర్ కూడా యావరేజ్‌గానే ఉండటంతో… బన్నీ అభిమానుల భయం ఇంకాస్త రెట్టింపయ్యింది. పైగా అజ్ఞాతవాసి కూడా సంక్రాంతి బరిలో వచ్చి బోల్తా కొట్టిందే. ఇప్పుడు అల వైకుంఠపురం సినిమా కూడా సంక్రాంతి బరిలోనే వస్తుండటం కూడా అభిమానులను ఆలోచింపజేస్తుంది.
మరీ బన్నీ, త్రివిక్రమ్ అభిమానుల భయం నిజమవుతుందో… ఈ సినిమాతో త్రివిక్రమ్ మూడో సినిమా ఫ్లాప్ అనే కాన్సెప్ట్‌ను తిరగరాస్తారో చూడాలి.