పాలిటిక్స్ పుణ్యమా అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టారు. కాస్త మంచి డ్రెస్ వేసుకుని కనిపించినప్పుడల్లా అదుగో పవర్ స్టార్ మళ్లీ సినిమా చేస్తున్నారనే టాక్ అడపాదడపా వినిపిస్తూనే ఉంటోంది. ‘జనసేనా’ధిపతిగా పూర్తిస్థాయి రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్.. ఎప్పుడు సినిమాలు చేస్తారని ఫాన్స్ అంతా ఎదురుచూస్తూనే ఉన్నారు.
ఎన్నికలు అయిపోయాక ఒక దశలో మళ్ళీ ఓ కొత్త సినిమా స్టార్ట్ చేస్తాడనే ఫీలింగ్ కూడా వచ్చింది అభిమానులకి. ఇప్పటివరకైతే అలాంటి ప్రయత్నాలు కానీ, సంకేతాలు కానీ పీకే సైడ్ నుంచి అస్సలు లేవు. కాకపోతే.. సినీ పరిశ్రమను ఏ మాత్రం మిస్ చేసుకోనన్నట్టుగా ఆమధ్య పవర్ స్టార్ సినిమాలకు సంబంధించిన ఒక పుస్తకం విడుదల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ ఏదైనా సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ చేస్తారని ఆశించిన అభిమానులకు పవన్ కల్యాణ్ నుంచి డిజప్పాయింట్‌మెంటే మిగిలింది. ఇదంతా చూశాక.. ఇక తను సినిమాల నుంచి పర్మినెంటుగా తప్పుకున్నట్టే అని ఫాన్స్‌కు గట్టి డౌటే వచ్చేసింది.
ఈ డౌట్ ఇలా వుండగానే ఒక చల్లని కబురు శీతల పవనంలా వచ్చి వారిని తాకింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం ‘సైరా’ కోసం రూపొందించే టీజర్‌కు పవర్ స్టార్ తన పవర్‌ఫుల్ వాయిస్ అందిస్తున్నారనే వార్త టాక్ ఆప్ ద టాలివుడ్‌గా నిలిచింది.
ఇప్పుడు మరో వార్త.. తాజాగా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురంలో’ మూవీకా కూడా పవన్ కల్యాన్ వాయిస్సోవర్ ఇవ్వబోతున్నాడని ఆవార్త సారాంశం. పవన్‌కు త్రివిక్రమ్ ఎంత ఆప్తుడో అందరికీ తెలిసిందే. తమ మధ్య ఉన్న స్నేహాన్ని దృష్టిలో వుంచుకుని పవర్ స్టార్ అల్లు అర్జున్ సినిమాకు తెరవెనుక గొంతును అందివ్వడానికి అంగీకరించారని సమాచారం. ఇదే కనక నిజమైతే, బన్నీ సినిమాకు అది తప్పకుండా ప్లస్ పాయింట్ అవుతుంది. సిన్మాల్లో తమ హీరో వాయిస్ ఇవ్వబోతున్నారన్న కబురుకే పవన్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. తెరపై కనిపించకపోయానా.. కనీసం తెర వెనుక వుండి నాలుగు మాటలు వినిపించినా చాలునని పండగ చేసుకుంటున్నారు.