మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హేగ్డే హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా అలా వైకుంటాపురములో. ఎప్పటిలాగే త్రివిక్రమ్ మరోసారి ఫామిలీ బ్యాక్ డ్రాప్ లొనే వచ్చాడు. మిడిల్ క్లాస్ అబ్బాయిగా అల్లు అర్జున్, దనవంతుడి బిడ్డగా సుశాంత్ అలరిస్తారు. అల్లు అర్జున్ ఇంట్లో గొడవలు ఎలా ఓవర్ కం చేస్తాడు, ఎలా పూజా తండ్రిని అర్జున్ తో పెళ్లికి ఒప్పిస్తాడు, అప్పటికే సుశాంత్ తో పూజా పెళ్లి సెట్ అవుతుంది కాబట్టి ఎలా హీరో డీల్ చేస్తాడు అనే అంశం చుట్టూ కథ తిరుగుతుంది.
ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సినిమా ఉంటుంది. పూజా అసిస్టెంట్ గా అల్లు అర్జున్ సీన్స్ బాగుంటాయి. అల్లు అర్జున్ ఎప్పటిలాగే అలరిస్తాడు. బుట్ట బొమ్మ సాంగ్ థియేటర్ లో అద్భుతంగా అనిపిస్తుంది. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్క్ పంచ్ డైలాగ్స్, కామెడీ మనం అనుకున్నంతగా లేవని చెప్పొచ్చు. ఇక సమజవరగమన సాంగ్ సెకండ్ హాఫ్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ సీన్స్ అక్కడక్కడ సాగదిసినట్లు అనిపించినా త్రివిక్రమ్ కాబట్టి బోర్ కొట్టదు. రాములో రాముల సాంగ్ తో సినిమా పాటలు ముగుస్తాయి. థమన్ సంగీతం, పాటలు సినిమాకు చాలా అడ్వాంటేజ్ అయ్యాయి. రిచ్ గా సినిమా తెరకెక్కటం కూడా కలిసొచ్చింది. స్క్రీన్ మీద అది స్పష్టం గా కనపడుతుంది. పైగా నటీనటులు అంతా కొత్తగా ప్రూవ్ చేసుకునేందుకు ఏమి లేదు.
Advertisements
ఓవరాల్ గా… సంక్రాంతి పండగ పూట ఫుల్ మీల్స్ భోజనం పెట్టె మూవీ.