పూజా హేగ్డే అందాల హీరోయిన్ గానూ, ఐటం గాళ్ గానూ మల్టిపుల్ ఎనర్జీతో ఫాన్స్ ను మురిపిస్తున్నారు. సాదాసీదాగా కన్నడ సీమ నుంచి టాలీవుడ్ లో ఎంటరై సక్సెస్ ఫుల్ హీరోయిన్ అయింది. మరోవైపు డిమాండ్ ఉండగానే సొమ్ముచేసుకోవాలనే సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తోంది. హీరోయిన్ గా మాంచి చాన్స్ ఉన్నా అవకాశమొచ్చినప్పుడల్లా ఐటెం గాళ్ గానూ చిందేస్తోంది. అటు హీరోయిన్ గా ఎంత ఫాలోయింగ్ ఉందో దానికంటే మిన్నగా ఐటెం గాళ్ గా పిచ్చ అభిమానం ఉంది.
రంగస్థలం మూవీలో జిల్..జిల్..జిగేలు రాణిగా ఐటెం సాంగ్ తో బిగ్ స్క్రీన్ ను షేక్ చేసింది. యూట్యూబ్ లో జిల్..జిల్..జిగేలు రాణి సాంగ్ ను 107 మిలియన్ల మంది చూశారంటే ఫాన్ ఫాలోయింగ్ ఏమిటో ఇట్టే అర్ధమవుతుంది. అందుకే అల్లు అర్జున్ అల వైకుంఠపురములో మూవీలో హీరోయిన్ గా చేస్తున్న పూజా హేగ్డే మహేష్ బాబు సరిలేరు నేనీకెవ్వరు సినిమాలో ఐటెం గాళ్ గా చిందేస్తోంది.
ప్రస్తుతం అల్లు అర్జున్, ప్రభాస్ మూవీల్లో ప్రాధాన్యం ఉన్న కేరేక్టర్లు చేస్తున్న పూజా హేగ్డే అందానికి మెరుగులు దిద్దుకోవడానికి నిత్యం ఒక వైపు జిమ్ లో కసరత్తులు చేస్తూనే మరో వైపు నచ్చిన ఫుడ్ లాగించేస్తోంది. పుస్తకాలు చదివి విజ్ఞానం పెంచుకుంటూ మ్యూజిక్ వింటూ ఆహ్లాదకరమైన జీవితం అనుభవిస్తోంది.
కర్ణాటక మంగుళూరు భామ పూజ హేగ్డే సినిమాల్లోకి రావాలని తొలుత ఆశించకపోయినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నాక అడ్వర్టయిజింగ్ రంగంలోకి అడుగిడి సినిమాల గురించి ఆలోచించింది. తమిళంలో మూగామూడీ, తెలుగులో ఒక లైలా కోసం చేసింది. తర్వాత వరుసగా మాంచి అవకాశాలు కొట్టేసింది.
పూజా హేగ్డే బర్త్ డే సందర్భంగా అల వైకుంఠపురములో మూవీలో బాక్సింగ్ గ్లౌజులతో పోస్టర్ ను చిత్ర బృందం షేర్ చేసింది. కష్టపడే తత్వం, అందం, టాలెంట్ ఉన్న కొత్త తరం నటి పూజా హేగ్డేకు ఈ ఏడాది అంతా విజయాలు చేకూరాలని అల వైకుంఠపురములో చిత్ర బృందం కోరుకుంటూ – హ్యాపీ బర్త్ డే పూజా హేగ్డే అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది.