స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అల వైకుంఠపురములో. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్స్ గా మారాయి. థమన్ ఇచ్చిన ఈ ట్యూన్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ జోష్ తగ్గేలోపే అల వైకుంఠపురములో సినిమా నుంచి మూడో సాంగ్ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. OMGDaddy అంటూ సాగే ఈ పాటని చిల్డ్రన్స్ డే కానుకగా రేపు ఉదయం ప్రోమోని రిలీజ్ చేయనున్నారు. గీత ఆర్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ బయటకి వచ్చింది. ఈ OMGDaddy అనే సాంగ్ లో ఇద్దరు స్టార్ కిడ్స్ సర్పైజ్ కూడా ఉంటుందట.
ఇదిలా ఉంటే త్రివిక్రమ్ నితిన్ తో తీసిన అ ఆ సినిమాలో కూడా మమ్మీ రిటర్న్స్ అనే సాంగ్ ఉంది. సమంత, నదియా గురించి పడే ఈ పాట బాగా వైరల్ అవుతూనే అ ఆ కథ కథనం ఎలా ఉండబోతున్నాయి అనే హింట్ ఇచ్చింది. ఇప్పుడు OMGDaddyతో కూడా త్రివిక్రమ్, అల వైకుంఠపురములో సినిమా కథ గురించి కానీ క్యారెక్టర్స్ గురించి కానీ ఏమైనా హింట్ ఇస్తాడా అనేది చూడాలి.