అలవైకుంఠపురం మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన బ్లాక్ బస్టర్ మూవీ. అల్లు అర్జున్ డాన్స్, డైలాగ్ డెలివరీ ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ మూవితో పూజా హెగ్డేకు క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది.
ఇక ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. తమన్ అందించిన సంగీతం ఈ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇవి మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఆడియెన్స్ ని ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే? ఈ సినిమాలో కనిపించిన పెద్ద ఇల్లు.
ఈ భారీ గృహంలో టబు కుటుంబం అనగా అల్లు అర్జున్ కి నిజమైన తల్లిదండ్రులు నివసిస్తూ ఉంటారు. అల్లు అర్జున్ మూవీ మొదట్లోనే ఆ ఇంట్లో అడుగు పెడతాడు. ఆ సమయంలో ఇంటి గేట్ ను చూపిస్తారు. ఆ తరవాత వచ్చే చాలా సన్నివేశాలు ఇంట్లో షూట్ చేశారు. ఇక ఈ ఇంట్లో తీసిన సన్నివేశాలు కూడా చాలా అందంగా కనిపించాయి.
సాధారణంగా సినిమాల షూటింగ్ కోసం భారీ సెట్ వేయడం అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో స్పెషల్ అట్రాక్షన్ గా ఇంటిని చూపించాలనుకున్నారు. దానికోసం త్రివిక్రమ్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఇంటి సెట్ ను వేయాలని చెప్పారట. అయితే అప్పుడు అల్లు అర్జున్ ఇంటి సెట్ వద్దని, నిజమైన ఇంటిలోనే సినిమాను చేయాలని చెప్పి, ఈ సినిమాలో ఉపయోగించిన ఇల్లు గురించి చెప్పారంట.
థియేటర్లలో ఈ మూవీని చూసిన ఆడియెన్స్ కి ఈ ఇల్లు చాలా నచ్చింది. ఇంద్రభవనంలా ఉన్న ఇల్లును చూసిన ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.
ఇక ఇంటి ముందున్న గేట్, ఇంట్లో ఉన్న ఫర్నిచర్, చుట్టూ ఉన్న చెట్లు, ఇంటి ముందు ఉన్న విశాలమైన స్థలం ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అల్లు అర్జున్ కి కూడా ఆ ఇల్లు చాలా నచ్చిందట.
బన్నీ ఎప్పటి నుండో అలాంటి ఇంటిని నిర్మించుకోవాలని అనుకున్నాడట. మరి ఇంత అందమైన ఇల్లు ఎవరిది అంటే ఎన్టీవీ ఛైర్మెన్ అయిన నరేంద్ర చౌదరి కుమార్తె రచనా చౌదరి భర్త ఇల్లు. ఇక ఆ ఇంటి కట్టడం కోసం 100 కోట్ల వరకు ఖర్చు చేసారని తెలుస్తోంది