ఏరులై పారుతున్న మద్యం
ఒక్క డిసెంబర్ నెలలోనే 3500 కోట్ల అమ్మకాలు
చివరి 5 రోజుల్లో వెయ్యి కోట్లు
అల్ టైం రికార్డ్ సెల్స్
నేర ప్రవృత్తిని పెంచుతున్న మద్యం
ఆదాయం వేటలో సక్సెస్ అయిన టీఆర్ఎస్ సర్కార్
తొలివెలుగు క్రైమ్ బ్యూరో:
తెలంగాణలో మద్యం ఏరలై పారుతుందని చెబితే.. తక్కువ చేసినట్లే అవుతుంది. ఏడాదిలో 39 కోట్ల బీర్ల సీసాలు, 44 కోట్ల బ్రాండీ సీసాల యూనిట్లు ఖాళీ చేశారంటే.. ఏం అనాలో అర్ధంకాని పరిస్థితి ఉంది. సెకన్ కి 25 బాటిళ్లు ఖతం చేస్తున్నారు. ఇబ్బడిముబ్బడిగా బెల్ట్ షాపులను ప్రోత్సహించడమే ఇందుకు ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. 2021లో 30 వేల 129 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ఎప్పుడూ రానంత ఆదాయం చివరి నెలలోనే వచ్చింది. 3435 కోట్ల లాభం చేకూరింది. చివరరి 5రోజుల్లోనే వెయ్యి కోట్లు మద్యం తాగారంటే తెలంగాణలో సమాజంలో ఏం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు.
రైతు బంధే కారణమా?
మందు లేనిది న్యూ ఇయర్ వేడుకలు జరగలేదు. గతంలో డబ్బులు లేకపోవడం వలన ఎక్కవ మంది కొంత వరకే ఖర్చు చేసేవారు. ఇప్పుడు రైతు బంధు ఎకరానికి 5 వేలు పడటంతో డిజిటల్ లావాదేవీలు అందుబాటులో ఉండటంతో.. తాగిన తర్వాత మళ్లీ మళ్లీ తాగాలనిపించే విధంగా ఉండటంతో ప్రభుత్వానికి భారీగా అదాయం పెరిగిందని తెలుస్తుంది. కొంత మంది ముందే తెచ్చుకొని పెట్టుకున్నారు. యువత మూడు రోజులు ఎంజాయి చేశారు. మిగితా రాష్ట్రాల్లో ఆంక్షలు ఉండటం.. అక్కడ నుంచి భారీగా రావడంతో అర్ధరాత్రి వరకు చాలా అమ్మకాలు పెరిగాయి. డిసెంబర్ 31న ఏడు గంటల వరకు 150 కోట్ల అమ్మకాలు జరిగాయి. చివరి 6 గంటల్లో మరో 150 కోట్ల వ్యాపారం జరిగినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. అంటే 300 కోట్ల రూపాయల మద్యం ఒక్క రోజులోనే లాగించేశారు.
టాప్ లో రంగారెడ్డి.
మద్యం అమ్మకాల్లో ఎప్పుడు రంగారెడ్డి జిల్లా టాప్ లో ఉంటుంది. ఈ ఏడాది మొత్తం 7వేల కోట్ల ఈ జిల్లా నుంచే వచ్చాయి. తర్వాత నల్లగొండ జిల్లా 3300, హైదరాబాద్ 3,200 అమ్మకాలు జరిగాయి. వందల కోట్ల అమ్మకాలు జరిపి మూడో ప్లేస్ లో ఉంది.