నందమూరి నట వారసుడు తారకరత్న గుండెపోటుకి గురైన తరువాత ఆయన కుటుంబ విషయాలు అనేకం తెర మీదకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది ఆయన భార్య, పిల్లల గురించి. తారకరత్న భార్య పేరు అలేఖ్య రెడ్డి. ఆమె పెళ్లికి ముందు కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేసేవారు. ఈ క్రమంలోనే తారకరత్న నందీశ్వరుడు సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
అయితే అలేఖ్యకి అంతకు ముందే మరో వ్యక్తితో వివాహం కావడం, అతని నుంచి విడాకులు తీసుకుని విడిపోవడం జరిగింది. ఈ విషయాలు తెలిసిన తారకరత్న తల్లిదండ్రులు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అటు అలేఖ్య కుటుంబం నుంచి పెళ్లికి వ్యతిరేకత వచ్చింది. దాంతో వీరిద్దరూ రహస్యంగా గుడిలో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల వారు వారికి దూరమయ్యారనే చెప్పవచ్చు.
పరువు మర్యాదల గురించి ఆలోచించిన తారకరత్న తండ్రి మోహనకృష్ణ తారకరత్న కుటుంబాన్ని గత పది సంవత్సరాలుగా దూరం పెట్టేశారు.ఇటీవల ఫిబ్రవరి 18వ తేదీన గుండెపోటుతో తారకరత్న 23 రోజులుగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి , వారి ముగ్గురు పిల్లలు ఒంటరి వారయ్యారు. ఈ క్రమంలోనే అలేఖ్య రెడ్డికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
భర్త మరణించిన తర్వాత ఒంటరిగా మారిన అలేఖ్య రెడ్డిని చూసిన ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోతుంది. ఈ క్రమంలోనే ఆమెకు అండగా నిలవాల్సిన ఫ్యామిలి ఎక్కడ ఉంది..ఆ ఫ్యామిలీ ఎవరు.. ఆమె నాన్న ఎవరు.. ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పుడు అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు..అలేఖ్య రెడ్డి ఎవరో కాదు.. వైసీపీ పార్టీలో ముఖ్యనేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి భార్య సొంత చెల్లెలి కూతురే అలేఖ్య రెడ్డి. ఇక అలేఖ్య రెడ్డి స్వస్థలం రాయలసీమ అనంతపురం. ఈమె తండ్రి పేరు మధుసూదన్ రెడ్డి .. ఆయన ఆర్డీఓ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
ఆ తర్వాత వీరి ఫ్యామిలీ అనంతపురం నుంచి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు. అలేఖ్య రెడ్డికి చెల్లి కూడా ఉంది ఆమె పేరు నేహా రెడ్డి. ఇకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత అలేఖ్య రెడ్డి కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేయడం మొదలు పెట్టింది.
Also Read: రైటర్స్ గా వచ్చి నటులుగా మారింది ఎవరంటే…?