స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినియోగదారులకు అలెర్ట్ ! సెప్టెంబర్ 30 తరువాత వారికి బ్యాంకు సర్వీసులు రద్దు చేయబోతున్నారు. వివరాల్లోకి వెళ్తే… సెప్టెంబర్ 30 లోపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినియోగదారులు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలి. లేదంటే ఆ తరువాత ఇబ్బందులు తప్పవు. గడువు తరువాత కూడా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే వారికి బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనుంది. ప్రభుత్వం పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అందుకే ఎస్‌బిఐ సాధ్యమైనంత త్వరగా ఆధార్‌తో పాన్‌ని లింక్ చేయాలని తన వినియోగదారులకు విజ్ఞప్తి చేసింది.
పాన్‌ని ఆధార్‌తో ఎలా లింక్ చేయాలంటే ?
ఇన్ కం టాక్స్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పేరు, పాన్ నంబర్, ఆధార్ సంఖ్యను ఎంటర్ చేయండి.
పుట్టిన ఏడాది ఆధార్ లో ఉంటేనే టిక్ చేయండి. తర్వాత క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.
దీని తరువాత లింక్ ఆధార్‌పై క్లిక్ చేయండి. మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడుతుంది.
SMS ద్వారా ఎలా లింక్ చేయాలంటే ?
ఫోన్‌లో UIDPAN అని టైప్ చేయాలి.
తరువాత 12 అంకెల ఆధార్ నంబర్, 10 అంకెల పాన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
ఇప్పుడు 567678 లేదా 56161 కి మెసేజ్ పంపండి. మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడుతుంది.
ఇన్ యాక్టివ్ PAN ని ఎలా ఆన్ చేయాలి
ఇన్ యాక్టివ్ పాన్ కార్డ్ మళ్లీ పని చేసేలా చేయాలంటే మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి 12 అంకెల పాన్ నెంబర్ కొట్టి, గ్యాప్ ఇచ్చి 10 అంకెల ఆధార్ నంబర్‌ను కొట్టాలి. ఈ మెసేజ్ ను 567678 లేదా 56161 కు SMS చేయండి.