మన దేశంలో టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 5జీ సేవలను కొన్ని రోజుల క్రితం విడుదల చేసారు. దీనితో కంపెనీలు తమ కస్టమర్ లను ఆకట్టుకోవడానికి మంచి ఆఫర్లు ఇస్తూ వస్తున్నాయి. జియో, భారతీ ఎయిర్టెల్ ఇటీవల ఈ సేవలను లాంచ్ చేసాయి. 13 నగరాల్లో 5జీ సేవలు ప్రయోగాత్మకంగా లాంచ్ కాగా త్వరలోనే మరికొన్ని నగరాల్లో రానున్నాయి.
ఇదిలా ఉంచితే ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడుతున్నారు. 5 యాక్టివేషన్ అంటూ లింక్ పంపించి మోసం చేస్తున్నారు. వాస్తవానికి 5జీ నెట్వర్క్ ను ఫోన్ లో యాక్టివేట్ చేసుకోవడానికి అవసరమైన ప్రాసెస్ ఫాలో కావాలి. మీ ఫోన్లలో 5Gని యాక్టివేట్ చెయ్యాలంటే ఈ లింకుపై క్లిక్ చేయలని మెసేజ్ వస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మన ఆతృతను అడ్డం పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.
ఎయిర్‌టెల్, జియో కంపెనీల నుంచి ఈ మెసేజ్ లు వస్తాయి. ఒటీపీల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. జియో అయినా ఎయిర్టెల్ అయినా సరే మీ దగ్గరలో ఉన్న స్టోర్ కి వెళ్లి చేసుకోవడం మంచిది. లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పర్సనల్/బ్యాంకింగ్ డిటైల్స్ ఏ మాత్రం షేర్ చేయవద్దు. ఇక మీకు తెలియకపోతే మాత్రం ఎవరిని అయినా అడిగి తెలుసుకుని మార్చుకోండి గాని సొంత ప్రయత్నాలు చేయకండి.