అల్జీరియాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో అంటుకున్న మంటలు వ్యాపించి 42 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువగా సైనికులు ఉన్నట్లు అక్కడి అధికారులు ప్రకటించారు. దాదాపు 25 మంది సైనికులు చనిపోయినట్లు ధృవీకరించారు.
బెర్బర్స్ పర్వతం, కబైలియా ప్రాంతంలో మంటలు వ్యాపించగా.. సుమారు వంద మంది పౌరులను సైన్యం కాపాడింది. అయితే పలుచోట్ల సైనికులు మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. ప్రజల్ని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
కబైలియా ప్రాంతంలో ఆలివ్ చెట్లు కాలిపోయాయి. ఇవే అక్కడివారికి జీవనాధారం. అలాగే మంటల ధాటికి పశువులు మృత్యువాత పడ్డాయి. వేగంగా వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు.