టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఆలీ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. ఫిలిం ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ కేవలం కొద్ది మందికి మాత్రమే అత్యంత సన్నిహితంగా ఉంటారు. అలాంటి వారిలో ఆలీ ఒకరు. దాదాపుగా పవన్ నటించిన అన్ని మూవీల్లోనూ ఆలీ నటించారంటే వారి మధ్య ఎంత గాఢమైన స్నేహం ఉందో అర్థం చేసుకోవచ్చు. అనేక ఈవెంట్లలో అనేక మంది దర్శకులు వారిద్దరి మధ్య స్నేహం గురించి అనేక విషయాలు చెప్పారు. కాగా ఇటీవల ఆలీ కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకలో పవన్ కల్యాణ్, ఆలీ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు.
ఏపీలో సాధారణ ఎన్నికల సమయంలో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. జనసేన పార్టీని పవన్ స్థాపించాక ఆలీ కూడా అందులోకి వెళ్తారని అనుకున్నారు. కానీ ఆలీ సడెన్‌గా వైసీపీలో చేరారు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యలకు బాధపడ్డ ఆలీ వైసీపీలో చేరాడని కొందరు అంటే, లేదు.. జనసేనలో ఆలీకి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వలేదని, అందుకనే ఆలీ వైసీపీలో చేరాడని కొందరు అన్నారు. అయితే అప్పటికి ఆ విధంగా కాలం గడిచినా.. ఇప్పుడు తాజాగా వీరు ఇద్దరూ ఒకే వేదికపై కలుసుకుని ఫొటోలకు పోజులివ్వడంతో ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారని, స్నేహితులు కాబట్టి మళ్లీ కలసిపోయారని.. చర్చించుకుంటున్నారు.
#PawanKalyan attended at Comedian #Ali Family Wedding pic.twitter.com/42iVbNYe15
— It's me 👉 Ramesh – Janasainik 😊 (@Urs_Ramesh_Urs) February 20, 2021
ఫిబ్రవరి 18వ తేదీన ఆలీ కుటుంబంలో జరిగిన ఆ వివాహ వేడుకకు పవన్ హాజరయ్యారు. ఆయనతోపాటు ఆలీ ఫొటోలు దిగారు. ఇక ఆలీ భార్య వారిద్దరికి చెందిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ మళ్లీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణ స్నేహితులు మళ్లీ కలిసిపోయారని అనుకుంటున్నారు. అయితే నిజానికి ఆ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అని, రాజకీయాలలో ఉన్నంత సేపే ఇద్దరూ వేర్వేరు పార్టీలకు చెందిన వారని, వ్యక్తిగతంగా వారు ఇప్పటికీ ఇంకా కలిసే ఉన్నారని కొందరు అంటున్నారు.