పదునైన సంభాషణలు, ఆసక్తి రేకెత్తించే కథనం, నటనతో మెప్పించే పాత్రలు వెరసి రెండూ సీజన్లతో అమెజాన్ ప్రైమ్ లో సందడిచేసిన మీర్జాపూర్ ముచ్చటగా మూడో సీజన్ తో మనముందుకు రాబోతుంది.
పంటిట్ పాత్రలో అలీ ఫజల్, మున్నా త్రిపాఠిగా దివ్యేంద్రు, అఖండానంద్ త్రిపాఠిగా పంకజ్ త్రిపాఠి అద్భుత నటన కనబరిచారు. ఈ పాత్రలను ప్రేక్షకులను అంతగా సులభంగా మర్చిపోలేరు. అన్న,చెల్లిని చంపిన మున్నా త్రిపాఠిని గుడ్డూ పండిట్ చంపడంతో రెండో సీజన్ ఎండ్ అయ్యి మూడోసీజన్ కోసం ఎదరు చూసేలా చేసింది.
గుడ్డూ పాత్ర్లలో గోల గోలచేసిన ఆలిఫాజల్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందన్న విషయాన్ని తన సహ నటీనటులు, టెక్నీషితో దిగిన ఫోటోను పోష్ట్ చేసి ఫాలోవర్స్ తో పంచుకున్నాడు. షూటింగ్ పూర్తైన సందర్భంగా తమ బ్రుందంతో చేసిన సందడిని ప్రేక్షకులకు వీడియో రూపంలో వీనులవిందుచేసారు.
2023 లో ఈ సిరీస్ ను విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుడ్టూ గుడ్డూన్యూస్ చెప్పడం ప్రేక్షల్లో మీర్జాపూర్ మూడో సీనజన్ మేనియా మొదలైనట్టైంది.