ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ప్రముఖ నటుడు అలీ కలిశారు.అలీ ఓ వైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు రాజకీయాల్లోను అడుగులు కదుపుతున్నారు. గత ఎన్నికల సమయలో అలీ వైసీపీకి సపోర్ట్ చేశారు. అదే సమయంలో ఆయనకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సైతం గొడవలు వచ్చాయి. 2014లో అలీ తెలుగుదేశం పార్టీలోకి వెళతారని జోరుగా వార్తలు షికారు చేశాయి. గుంటూరు లేదా రాజమండ్రి నుంచి పోటీ చేస్తారనే వార్తలు వచ్చాయి.
ఆతర్వాత పవన్ కళ్యాణ్ పెట్టిన జనసేన పార్టీలో కాకుండా .. అనూహ్యంగా వైసీపీ లోకి చేరడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆతర్వాత పవన్ అలీ తనను మోసం చేసాడని చెప్పడం పెద్ద దుమారం రేపింది. ఆ తర్వాత అలీ దానికి వివరణ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఆతర్వాత కూడా అలీ వైసీపీ కే మద్దతుగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా అలీ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీకి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది.