బిగ్‌బాస్ సీజన్ 3లో ఈవారం ఎలిమినేషన్ అలీ రెజా. అతనికి వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అందరూ దీన్ని కన్ఫమ్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎలిమినేషన్స్ గురించి కచ్చితమైన లాజిక్‌తో న్యూస్ అందించే నూతన్ నాయుడు కూడా ఈవారం అలీ దాదాపు వెళ్లిపోవచ్చుననే చెప్పేశారు. కాకపోతే నూతన్ నాయుడు చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చారు. అలీ లేదా రవికృష్ణ వెళ్లచ్చని ఆయన అంచనా వేశారు. అలాగే వచ్చేవారం బిగ్‌బాస్ హౌసులోకి మరో వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా వుంటుందని, ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా కచ్చితంగా ఫిమేల్ పర్సన్ అయివుంటుందని నూతన్ నాయుడు మనకు అందించిన సమాచారం. అలీ తొలిసారిగా ఈవారం ఎలిమినేషన్ లిస్టులో చేరాడు. అతడు ఎప్పుడు ఎలిమినేషన్‌కు నామినేట్ అవుతాడా అని చాలామంది ఎదురుచూసినట్టు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. మొత్తం మీద అలీ నామినేషన్ లిస్టులో చేరడం, మొదటిసారి నామినేట్ అవ్వడమే కాకుండా ఆ లిస్టులో తనే ఏకంగా ఎగ్జిట్ అయిపోతుండటం కొసమెరుపు.