రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ భామ పెళ్లికూతురిగా ముస్తాబయ్యింది. నిజంగా పెళ్లి చేసుకోబోతోందా అని ఫ్యాన్స్‌కో డౌట్ ! కాదనుకోండి. కొంపదీసి ఇది ఆర్ఆర్ఆర్ మూవీ కోసమా అని మెగాభిమానులు చెక్ చేసుకున్నారు. అది కూడా కాదని లాజికల్‌గా ఆలోచించారు. ఈ చిత్రాల్లో అలియాభట్ అధునాతన వస్త్రధారణతో కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్‌లో తన పాత్ర సీతారామరాజుకు ఇల్లాలు కావాల్సిన సీత పాత్ర అని రాజమౌళి టీమ్ నుంచి ఎప్పుడో కబురొచ్చింది. దాని బట్టీ ఇది సీత కోసం కాదని అంచనాకు వచ్చారు. సో.. ఆరా తీస్తే తీరా తెల్సిందేమంటే, అలియాభట్ ఒక దుస్తుల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తోందట. ఆ కంపెనీ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఫోటో షూట్.. అదీ మేటర్!
Tolivelugu Latest Telugu Breaking News » Cinema » పెళ్లికూతురిగా అలియా