భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ కీలక దశకు చేరుకుంటుంది. ఈ మూవీలో రాంచరణ్ సరసన బాలీవుడ్ తార అలియా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్ షూట్ పూర్తి చేసిన అలియా… మరో రెండు పాటల షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు పాటలు పూర్తయితే దాదాపుగా తన వరకు షూటింగ్ ముగిసినట్లే.
వచ్చే ఏప్రిల్ లో ఆ రెండు పాటల కోసం అలియా డేట్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో ఈ షూటింగ్ జరగనుంది.
ఆర్.ఆర్.ఆర్ ను అక్టోబర్ 13న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.