భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్. ఎన్టీఆర్, రాంచరణ్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తుంది. తాజాగా ఆర్.ఆర్.ఆర్ షూట్ కు అలియా హజరైనట్లు తెలుస్తోంది.
అలియా భట్ పై తీయాల్సిన షూట్ అంతా సింగిల్ షెడ్యూల్ లో… పుణేలో చిత్రీకరించనున్నారు. అలియా భట్ రాంచరణ్ తో రొమాన్స్ చేయనుంది.
రాంచరణ్, ఎన్టీఆర్ లపై సింగిల్ గా తీయాల్సిన షూట్ లో చాలా వరకు పూర్తి కావటంతో… ఇద్దరూ కలిసి నటించే సీన్స్ ఇప్పుడు తీయబోతున్నారు. దాదాపు 400కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం, 2022లో విడుదలయ్యే అవకాశం ఉంది.