దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర లో రామ్ చరణ్ కనిపించనున్నారు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో కనిపించనున్నారు.
ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. కరోనా తర్వాత ఇటీవల ప్రారంభం అయిన ఈ షూటింగ్ లో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ జాయిన్ అయింది. ఈ విషయాన్ని అలియా భట్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసింది . ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా అలియా నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ డ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తుంది.