ఆలియా భట్ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం గంగూబాయి కతియవాడి. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది.
అటు గంగూబాయి.. ఇటు ఆర్‌ఆర్‌ఆర్ సినిమాల ప్రచారంలో ఇన్నాళ్లు బిజీగా ఉన్న ఆలియా హాలిడే ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం తన అమ్మ సోనీ రజ్దాన్, సోదరి షాహీన్ భట్ తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించింది.
ముగ్గురు పెద్ద బ్యాగులతో వెళ్తుండగా కెమరాకు చిక్కారు. ఈనెల 15న ఆలియా బర్త్ డే. ఈ నేపథ్యంలో హాలిడే ట్రిప్ ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నారు.
ఎవరూ గుర్తు పట్టకుండా బ్లాక్ డ్రెస్.. ఫేస్ కి మాస్క్.. కళ్లద్దాలతో ఉంది ఆలియా. చాలా దూరం నుంచి కెమెరామెన్స్ ఫోటోలు తీశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.