బాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరైన ఆలియా భట్.. తల్లిగా ప్రమోషన్ పొందిన తరువాత మొదటిసారిగా ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో ఆమె కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆలియా తన కెరీర్ కు ఫుల్ స్టాప్ పెడుతుందని నెట్టింట వస్తున్న వార్తలపై ఆలియా స్పందించారు. పెళ్లి అయిన తరువాత చాలా మంది నటీమణులలాగే ఆమె కూడా పని కంటే కుటుంబం పైనే ఎక్కువ దృష్టి పెడుతుందా అన్న ప్రశ్నలపై క్లారిటీ ఇచ్చారు.
తనకు తన పాపే ఫస్ట్ ప్రయారిటీ అని స్పష్టం చేశారు. నిజానికి సినిమాలకే తన మొదటి ప్రాధాన్యత అని… కానీ ప్రస్తుతం అవి మారాయని చెప్పారు. ప్రస్తుతం మెటర్నిటీ బ్రేక్ ను ఎంజాయ్ చేస్తున్న ఆలియా… తన కుమార్తెను గాఢంగా ప్రేమిస్తున్నట్లు తెలిపారు.
కానీ క్వాంటిటీ కంటే క్వాలిటీ అధిక ఇంపార్టెన్స్ ఇస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన కుమార్తె రాహాకు 2ఏళ్లు వచ్చే వరకు తనకు సంబంధించిన ఎలాంటి ఫొటోలను తీయొద్దని ఆలియా అభ్యర్థించారు. పఠాన్ విజయంపైనా ఆలియా స్పందించారు.’చాలా చాలా సంతోషంగా ఉంద’ని చెప్పారు. “పఠాన్ లాంటి సినిమా కేవలం బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, భారతీయ సినిమాల్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అని వ్యాఖ్యానించారు.
తన ప్రసూతి విరామం తర్వాత ఆలియా రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు. కరణ్ జోహార్ రొమాంటిక్ డ్రామా పెండింగ్ భాగాలను గల్లీ బాయ్ సహనటుడు రణ్‌వీర్ సింగ్‌తో కలిసి నటించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలో కశ్మీర్‌లో చిత్రీకరించబడుతోంది. దాంతో జీ లే జరా షూటింగ్‌ని ప్రారంభించాలని భావిస్తున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కనున్న రోడ్ మూవీలోనూ అలియా భట్ నటించనున్నట్టు సమాచారం.