బాలీవుడ్ అందాల జంట రణబీర్ కపూర్, ఆలియా భట్ లు గతేడాది వివాహం చేసుకొని నవంబర్ లో ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాపకు వారు రాహా అని పేరు కూడా పెట్టారు. కానీ ఇప్పటి వరకు ఆలియా కానీ, రణబీర్ కానీ పాప ఫోటోను బయటకు చూపించలేదు.
అంతే కాకుండా రాహాకు రెండు సంవత్సరాలు వచ్చే వరకు పాప ఫోటోలు పోస్ట్ చేయమని కూడా ఆలియా చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగాఇన్స్టాగ్రామ్లో ఆలియ కూతురి ఫొటో అంటూ ఓ క్యూట్ బేబీ ఫొటో వైరల్ అవుతోంది. ఆలియా తన ఇన్‌స్టాలో కొన్ని చిన్నపిల్లల ఫొటోలు పోస్టు చేసింది.
అందులో పింక్ కలర్ డ్రెస్‌లో ఉన్న చిన్నారి క్యూట్‌గా అచ్చం బుల్లి ఆలియాలాగే ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు అది రాహా ఫొటోనేనని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
ఆలియా భట్ తన ఫ్యాషన్ బ్రాండ్ ఎడా మమ్మా కోసం ఓ ప్రమోషనల్ షూట్ చేసింది. ఈ బ్రాండ్‌కు సంబంధించే ఇప్పుడు చిన్న పిల్లల ఫొటోలు పోస్టు చేసింది. ఈ క్రమంలోనే గురువారం కూడా షేర్ చేసింది. కానీ, అది రాహా ఫొటో అంటూ నెటిజన్లు చర్చ మొదలుపెట్టారు. అయితే దానిపై ఆలియా స్పందిస్తుందేమో చూడాలి.