బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గంగూబాయి చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. ఇక త్వరలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే కొరటాల శివతో జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమాలో కూడా అలియాభట్ నటించనుంది.
ఇప్పుడు అలియా భట్ మరో భారీ-బడ్జెట్ పాన్ ఇండియా కి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోయే సినిమాలో కూడా అలియాభట్ ను సెలెక్ట్ చేశారట. ఈ ఇద్దరి జంట బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట.
అయితే చర్చలు ఇంకా కొనసాగుతున్నాయట. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే, అలియా మహేష్‌తో జతకట్టటం పక్కానట. ఆర్ ఆర్ ఆర్ కంటే మహేష్ సినిమాలో పాత్రకు ప్రాధాన్యత ఎక్కువట.
దీనికన్నా ముందు అలియా, మహేష్ లు ఇద్దరూ కూడా ప్రస్తుత కమిట్‌మెంట్‌లన్నింటినీ కంప్లీట్ చేయాలని చూస్తున్నారట. ఇక రాజమౌళి తో మహేష్ చేయబోయే సినిమాలో VFX ఎక్కువగా ఉంటుందట. అలాగే జంగిల్ వైబ్స్ కోసం రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.